Home > తెలంగాణ > అయ్యప్ప మాల వేసిన విద్యార్థి.. స్కూల్ యాజమాన్యం చేసిన పనికి అంతా షాక్

అయ్యప్ప మాల వేసిన విద్యార్థి.. స్కూల్ యాజమాన్యం చేసిన పనికి అంతా షాక్

అయ్యప్ప మాల వేసిన విద్యార్థి.. స్కూల్ యాజమాన్యం చేసిన పనికి అంతా షాక్
X

అయ్యప్ప మాల వేసిన ఓ విద్యార్థిపై ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చాలా అమానుషంగా ప్రవర్తించింది. అయ్యప్ప మాల వేసి స్కూల్ కు వెళ్లిన విద్యార్థినిని క్లాస్ లోకి రానీయకుండా బయట ఎండలో నిలబెట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడలో జరిగింది. బండ్లగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 4వ తరగతి చదువుతున్న పూర్వి అనే విద్యార్థిని అయ్యప్ప మాల వేసింది. ఇవాళ ఉదయం పాఠశాలకు వెళ్లిన సదరు విద్యార్థినిని అయ్యప్ప మాలతో వచ్చిందంటూ స్కూల్ యాజమాన్యం క్లాస్ లోకి అనుమతించలేదు. స్కూల్ యూనిఫామ్ ఉంటేనే క్లాస్ లోకి అనుమతిస్తామంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. యూనిఫామ్ లో రానందుకు ఆ విద్యార్థిని ఎండలో నిలబడాలంటూ చెప్పింది. దీంతో ఆ విద్యార్థి గంటకు పైగా ఎండలోనే నిలబడింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్ర స్వామి పాఠశాలకు చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు. స్కూల్ చర్యలను ఖండిస్తూ పాఠశాల ముందు ఆందోళనకు దిగాడు. పసిపాపను ఎండలో ఎలా నిలబెడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయ్యప్ప మాల వేయడం నేరమా అని ప్రశ్నించారు.

ఒకవేళ స్కూల్ యూనిఫామ్ వేసుకురాకుంటే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలే తప్ప ఇలా పనిష్ మెంట్ విధించడం ఏంటని గట్టిగా నిలదీశాడు. విద్యార్థి ఎండలో నిల్చున్న దృశ్యాలను తండ్రి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించడానికి ప్రయత్నించగా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. స్కూల్ లో సెల్ ఫోన్ రికార్డింగ్ లు లాంటివి చెల్లవంటూ బెదిరించారు. తక్షణమే విద్యార్థిని తీసుకొని పాఠశాల నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. యూనిఫామ్ లేకుంటే స్కూల్ లోపలికి అనుమతించకపోవటం వరకు ఓకే గానీ.. ఎండలో నిలబెట్టడం ఏంటనీ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రితో పాటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

A student was made to stand in the sun for wearing Ayyappa mala in Bandlaguda

rangareddy district,rajendra nagar,bandlaguda,private,school,ayyappa mala,punishment,poorvi,father,sawmi,video,viral,netigens

Updated : 11 Dec 2023 2:57 PM IST
Tags:    
Next Story
Share it
Top