Home > తెలంగాణ > హిమాన్షు.. తమ స్కూల్ను కూడా డెవలప్ చేయాలని విద్యార్థుల నిరసన

హిమాన్షు.. తమ స్కూల్ను కూడా డెవలప్ చేయాలని విద్యార్థుల నిరసన

హిమాన్షు.. తమ స్కూల్ను కూడా డెవలప్ చేయాలని విద్యార్థుల నిరసన
X

సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు రావు.. హైదరాబాద్ శివారులోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ స్కూల్ ను కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా తీర్చిదిద్దడంలో తన వంతు కృషి చేశాడు. తోటి విద్యార్థుల సాయంతో రూ. 40 ల‌క్ష‌లు , సీఎస్ఆర్ ఫండ్ కూడా కంట్రిబ్యూట్ చేయడంతో దాదాపు రూ. కోటి వెచ్చించి స్కూల్‌ను పునర్నిర్మించాడు. తన పుట్టినరోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆ స్కూల్‌ను ప్రారంభించాడు. దీంతో రాష్ట్రంలో హిమాన్షురావు పేరు వార్తల్లో నిలిచింది. దీన్ని కొందరు సాయం అంటుంటే.. మరికొందరు రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా.. రాష్ట్రంలోని వివిధ స్కూళ్ల పిల్లలకు హిమాన్షు రోల్ మోడల్ అయ్యాడు.

ఈ క్రమంలో పలు గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులు హిమాన్షును.. ‘అన్నా మా స్కూల్ ను కూడా జర బాగు చేయండి. దత్తత తీస్కోని అభివృద్ధి చేయండం’టూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నారాయణగూడలోని ఓ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు హిమాన్షుకు.. ప్లకార్డులు పట్టుకుని తమ కోరికలు తెలియజేశారు. దీనికి ఏఐవైఎఫ్, బాల సంఘం మద్దతు తెలిపి.. వారి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నిరసనలు ప్రదర్శించారు.

తమ స్కూల్ లో మరుగుదొడ్ల డోర్లు విరిగిపోయాయిని, ప్లే గ్రౌండ్, కంప్యూటర్లు కూడా లేవని తెలిపారు. బాత్ రూమ్స్ లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా 24వేల స్కూళ్లల్లో ఇదే పరిస్థితి నెలకొందని వివరించారు. మన బస్తీ, మన బడి నిధులు పక్కదారి పట్టిస్తూ, గవర్నమెంట్‌‌‌‌ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.




Updated : 15 July 2023 5:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top