తెలంగాణకు నూతన అడ్వకేట్ జనరల్.. ఆయన ఎవరంటే?
Bharath | 30 Dec 2023 7:49 PM IST
X
X
రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారుల బదిలీలు, నియామకాల ప్రక్రియ చేపడుతుంది. ఈ క్రమంలో తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఆయనను ఏజీగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదన ఫైల్ పై గవర్నర్ తమిళిసై సంతకం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో.. ఆ ప్రభుత్వ హయాంలో నియమించిన బీఎస్ ప్రసాద్ ఏజీ పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా ఖాళీగా ఉన్న ఆ పోస్ట్‌లో సుదర్శన్ రెడ్డిని నియమించారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ గా బాధ్యతలు నిర్వహించారు. కాగా, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి సహకారం అందిస్తారు.
Updated : 30 Dec 2023 8:47 PM IST
Tags: Sudarshan Reddy Advocate General of Telangana congress cm revanth reddy brs kcr Governor Tamilisai BS Prasad kiran kumar reddy telangana hyderabad
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire