Home > తెలంగాణ > Barrelakka Sirisha : ప్రచారంలో దూకుడు.. బర్రెలక్కకు పెరుగుతున్న మద్దతు..

Barrelakka Sirisha : ప్రచారంలో దూకుడు.. బర్రెలక్కకు పెరుగుతున్న మద్దతు..

Barrelakka Sirisha : ప్రచారంలో దూకుడు.. బర్రెలక్కకు పెరుగుతున్న మద్దతు..
X

బర్రెలక్క.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు ఇది. అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న శిరీష అలియాస్ బర్రెలక్క అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులకు మద్దతుగా ఎన్నికల్లో పోటీకి నిలబడ్డ బర్రెలక్కకు ఊహించని రీతిలో మద్దతు లభిస్తోంది. ల‌క్ష రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్‌ కూడా లేని ఆమె.. ధైర్యంగా ఎన్నిక‌ల బరిలో దిగిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల బరిలో దిగిన శిరీషకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా యువత ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సపోర్ట్ తో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్కకు సోషల్ మీడియాలోనూ విపరీతంగా మద్దతు లభిస్తోంది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం ఇలా ప్రతి ప్లాట్ ఫాంలోనూ బర్రెలక్కకు మద్దతుగా పాటలు నినాదాలు పోటెత్తుతున్నాయి. యూత్ పెద్ద సంఖ్య‌లో ఆమెకు ఆన్‌లైన్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఎవ‌రూ ఒక్క రూపాయి ఆశించ‌కుండా.. బ‌ర్రెక్క‌ను గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి.

శిరీషకు మద్దతుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రచారానికి అవసరమైన బ్యానర్లు, ఇతర సామాగ్రి అందించాయి. మరికొందరు ప్రచార ఖర్చులను భరిస్తున్నారు. దీంతో ఎటు చూసినా బ‌ర్రెల‌క్క గెలుపు.. కొల్లాపూర్‌కు మ‌లుపు అనే నినాదం వినిపిస్తోంది. మొదట్లో ఎవరి నుంచి అంతగా స్పందన లేకపోయినా పోలింగ్ దగ్గరపడేకొద్దీ జనాల్లో బర్రెలక్కను గెలిపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన రేకెత్తిసోంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు కుటుంబాలు శిరీష‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు స్థానిక నేతల్లో ఆందోళనకు కారణమవుతోందని సమాచారం.




Updated : 20 Nov 2023 1:17 PM IST
Tags:    
Next Story
Share it
Top