Supreme Court: బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ.. పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
X
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. కారును పోలిన గుర్తులను ఎలక్షన్ బ్యాలెట్ నుంచి తొలగించాలని.. బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఫ్రీ సింబల్ జాబితాలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని పిటిషన్ లో కోరింది. కారు గుర్తును పోలిన గుర్తులను ఏ ఇతర పార్టీకి కేటాయించొద్దని పిటిషన్ లో తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం పిటిషన్ ను తోసిపుచ్చింది.
ఈ నేపథ్యంలో కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, కెమెరా, చపాతీ రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ లాంటి గుర్తులను తొలగించాలని కోరింది. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో.. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తెలిపింది. అధికార పార్టీ అయివుండి.. ఈ నిర్ణయంపై 240 రోజులు ఆలస్యం ఎందుకు చేశారని ప్రశ్నించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.