Home > తెలంగాణ > ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. గతంలో ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో పిటిషన్ను డిస్మిస్ చేసింది.

కాగా 2015 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేసినట్లు రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ రేవంత్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైలుకు వెళ్లిన రేవంత్.. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.


Updated : 3 Oct 2023 4:21 PM IST
Tags:    
Next Story
Share it
Top