Home > తెలంగాణ > సీఎం జగన్, సీబీఐకి సుప్రీం నోటీసులు

సీఎం జగన్, సీబీఐకి సుప్రీం నోటీసులు

సీఎం జగన్, సీబీఐకి సుప్రీం నోటీసులు
X

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషనన్ ను సుప్రీంకోర్టు విచారించింది. బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ, ఈడీలు సవాల్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు ఇచ్చి.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటు ఈ కేసు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలన్న మరో పిటిషన్ ను ప్రస్తుత పిటిషన్ తో జత చేయాలని రిజిస్ట్రీని సుప్రీం కోర్టు ఆదేశించింది. గతతపదేళ్లుగా జగన్ బెయిపై తిరుగుతూ.. సాక్ష్యాలను చెరిపేస్తున్నారని రఘురామకృష్ణ ఆరోపించారు.

వెంటనే బెయిల్ రద్దు చేయాలని పిటిసన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ సాక్ష్యాలు చెరిపేస్తున్నారు అనేదానపై ఆధారాలు ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామ తరపు న్యాయవాదులు కోర్టుకు అందిచారు. జగన్ కు బెయిల్ ఇచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థలు న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాదులు కోరారు.


Updated : 24 Nov 2023 1:48 PM IST
Tags:    
Next Story
Share it
Top