Home > తెలంగాణ > రూ.2 వేల నోటు మార్పిడిపై పిటిషన్‌ను స్వీకరించని సుప్రీం..

రూ.2 వేల నోటు మార్పిడిపై పిటిషన్‌ను స్వీకరించని సుప్రీం..

రూ.2 వేల నోటు మార్పిడిపై పిటిషన్‌ను స్వీకరించని సుప్రీం..
X

రూ.2వేల నోట్లను మార్పిడిపై ఆర్భీఐ నోటిఫికేషన్లను వ్యతిరేకిస్తూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల సమయంలో అటువంటి అభ్యర్థనను స్వీకరించమని స్పష్టం చేసింది.

ఇటీవల రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఉన్న 2 వేల నోట్లును మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. బ్యాంకుల్లో సెప్టెంబర్ వరకు మార్చుకోవచ్చని గడువు ఇచ్చింది. ఈ నోట్లను ఎటువంటి ఐడీ ప్రూఫ్‌, దరఖాస్తు లేకుండా మార్పిడి చేసుకోవచ్చంటూ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే దీనిపై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ కోర్టును ఆశ్రయించారు.

ఎలాంటి ఐడీ ప్రూఫ్‌, దరఖాస్తు లేకుండా నోట్లు మార్పిడి చేసేందుకు అవకాశం కల్పిస్తే నేరస్థులు, ఉగ్రవాదులు దీన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉందని మొదట ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పరిశీలించిన న్యాయస్థానం.. మే 29న ఆ పిల్‌ను తోసిపుచ్చింది. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించాగా జస్టిస్‌ సుధాన్షు దులియా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. వేసవి సెలవుల్లో ఈ తరహా కేసులు విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.


Updated : 1 Jun 2023 1:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top