లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు రిలీఫ్..
X
లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది. ఈ నెల 26 వరకు ఆమెకు సమన్లు జారీ చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. నళినీ చిదంబరం లాగే తనకూ రిలీఫ్ ఇవ్వాలని కవిత కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్ట్ ధర్మాసనం ఈడీ అడ్వొకేట్ అభిప్రాయం కోరింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో సెప్టెంబర్ 26 వరకు కవితకు సమన్లు జారీ చేయొద్దని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు దుళియా, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు మహిళల్ని ఇంటి వద్ద విచారించాలని, సమయ పాలన పాటించాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జస్టిస్ కౌల్ ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.