Home > తెలంగాణ > గద్వాల్ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్..

గద్వాల్ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్..

గద్వాల్ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్..
X

గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. గతంలో ఆయనపై హైకోర్టు అనర్హత వేటు వేయగా.. కృష్ణమోహన్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికల సంఘం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

కాగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు అగస్ట్ 24న తీర్పునిచ్చింది. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కేసుపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీచేయగా.. డీకే అరుణ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. అంతకుముందు

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించినందుకు కోర్టు అనర్హత వేటు వేయడంతో పాటు రూ.5 లక్షల ఫైన్ విధించింది. అయితే వనమా సుప్రీం కోర్టు ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో ఆయనకు ఊరట దక్కింది.



Updated : 11 Sept 2023 1:07 PM IST
Tags:    
Next Story
Share it
Top