విద్యుత్ ఉద్యోగికి హ్యాట్సాఫ్.. నీటిలో ఈదుకుంటూ వెళ్లి..
X
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో ఓ గ్రామంలో కరెంట్ కట్ అయ్యింది. అయితే విద్యుత్ ఉద్యోగి నీటిలో ఈదుకుంటూ వెళ్లి స్తంభంపై మరమ్మత్తులు చేసి గ్రామానికి కరెంట్ వచ్చేలా చేశాడు. అతడు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో సూర్యపేట జిల్లా పాతర్ల పహాడ్ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే నీట మధ్యలోని ఓ స్తంభం వద్ద వైర్లు తెగిపోవడంతో గ్రామానికి కరెంట్ లేకుండా పోయింది. దీంతో ఎలక్ట్రికల్ హెల్పర్ కొప్పుల సంతోష్.. కరెంట్ ఇవ్వడానికి సాహసం చేశాడు. నీటిలో ఈదుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి తీగను మరమ్మత్తు చేశాడు. దీంతో ఆ గ్రామానికి కరెంట్ వచ్చింది.
సంతోష్ చేసిన సాయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం సంతోష్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. జోరు వానల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం కరెంట్ వస్తుందంటే.. దాని వెనుక ఉద్యోగుల కష్టం ఎంతో ఉందని పలువురు కామెంట్లు వినిపిస్తున్నారు.
కరెంట్ ఇవ్వడం కోసం నీటిలో ఈదుకుంటూ వెళ్లి మరమ్మత్తు చేసిన విద్యుత్ ఉద్యోగికి హ్యాట్సాఫ్
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2023
సూర్యాపేట - ఇంత భారీ వర్షంలో కూడా అంతరాయం లేకుండా కరెంట్ వస్తుందంటే అది విద్యుత్ ఉద్యోగుల కృషి వల్లే.
పాతర్ల పహాడ్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంపునకు గురవుతున్న ప్రాంతం… pic.twitter.com/sge26VnAgo