Home > తెలంగాణ > సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మేళ్లచెరువులోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అనుమతులు లేకుండా నూతనంగా ఓ యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఈ నూతన యూనిట్ - 4 వద్దే ప్రమాదం చోటు చేసుకుంది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా హఠాత్తుగా లిఫ్ట్ కూలి కిందపడింది. దీనికింద కాంట్రాక్ట్ కార్మికులు కొందరు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








Updated : 25 July 2023 2:23 PM IST
Tags:    
Next Story
Share it
Top