Home > తెలంగాణ > కొలిక్కిరాని సీఎం ఎంపిక వ్యవహారం.. ఢిల్లీకి వెళ్లిన డీకే

కొలిక్కిరాని సీఎం ఎంపిక వ్యవహారం.. ఢిల్లీకి వెళ్లిన డీకే

కొలిక్కిరాని సీఎం ఎంపిక వ్యవహారం.. ఢిల్లీకి వెళ్లిన డీకే
X

తెలంగాణ కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సీఎం అభ్యర్థిపై సుదీర్ఘంగా చర్చలు జరిపినా.. ఓ నిర్ణయం తీసుకోలేకపోయారు. హైకమాండ్ పిలుపు మేరకు డీకే శివకుమార్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మరికాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఎంపిక ఇంకా ఫైనల్ కాకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఈ విషయంపై ఏఐసీసీ అబ్జర్వర్లు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం సీఎం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశముంది.

Updated : 4 Dec 2023 1:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top