Home > తెలంగాణ > Tadikonda Rajaiah : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రాజయ్య..పార్టీలో చేరిక లాంఛనమే

Tadikonda Rajaiah : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రాజయ్య..పార్టీలో చేరిక లాంఛనమే

Tadikonda Rajaiah   : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రాజయ్య..పార్టీలో చేరిక లాంఛనమే
X

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాజీ డిప్యూటీ సీఎం బీఆర్‌ఎస్ నేత తాడికొండ రాజయ్య భేటీ అయ్యారు.ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండడం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీఎంతో రాజయ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2018 ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజయ్యకు గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. ఆయన్ను సంతృప్తి పరిచేందుకు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం రైతుబంధు సమితి చైర్మన్‌గా నియమించింది. అయినప్పటికీ రాజయ్య పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు. రాష్ట్రంలో అధికారం మారడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.





అయితే రాజయ్య పార్టీలో చేరికకు కొందరు వ్యతిరేకించున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆయన పైన అనేక లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సర్పంచ్ నవ్య ఉదంతం రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించింది. మహిళల నాయకులు రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు నిరసలు చేపట్టుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి కాంగ్రెస్ చేరికపై మంతనాలు జరిపినట్లు సమాచారం. వరంగల్ ఎంపీ టికెట్ అడుతున్నట్లు సమాచారం ఇదే టికెట్ ఆశించిన సిరిసిల్ల రాజయ్యకు ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా సర్కారు నియమించింది. దీంతో రాజయ్యకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విధితమే




Updated : 17 Feb 2024 1:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top