Home > తెలంగాణ > BRS గెలుపు గుర్రాల జాబితా సిద్దం.. రేపే ప్రకటన?

BRS గెలుపు గుర్రాల జాబితా సిద్దం.. రేపే ప్రకటన?

BRS గెలుపు గుర్రాల జాబితా సిద్దం.. రేపే ప్రకటన?
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్​ఎస్​ అధిష్ఠానం దాదాపు కసరత్తు పూర్తిచేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. గత ఎన్నికల్లో.. ఇతర పార్టీ నుంచి గెలిచి తర్వాత బీఆర్​ఎస్​లో చేరిన వారున్న చోట.. మొదటి నుంచీ పార్టీలో ఉంటూ టికెట్‌ కోసం పోటీపడుతున్న వారిని అధిష్ఠానం పిలిపించి మాట్లాడుతోంది. మళ్లీ ప్రభుత్వం ఏర్పడగానే వారికి ఇతరత్రా అవకాశం కల్పిస్తామని.. నచ్చజెప్పి ఒప్పించే పనిలో కొన్నాళ్లుగా అధినాయకత్వం నిమగ్నమైంది. మొదటి విడత.. అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. టికెట్‌కు అవకాశం లేనివారిలో అసంతృప్తి తలెత్తకుండా.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao) తదితరులు ముందుగా మాట్లాడి తర్వాత అవసరాన్ని బట్టి.. సీఎం కేసీఆర్‌(CM KCR)తో మాట్లాడిస్తున్నారు.

ఇక అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఇప్పటివరకూ అదే జరిగింది. కానీ గతేడాది దసరా సందర్భంగా పార్టీని జాతీయ స్థాయికి విస్తరింపచేసే ఆలోచనతో బీఆర్ఎస్‌గా నామకరణం చేయడంతో కేసీఆర్ జాతీయ అధ్యక్షుడయ్యారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. రేపు మంచిరోజు కాబట్టి అన్నీ అనుకూలిస్తే రేపు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆ జాబితాను విడుదల చేయనున్నట్లు టాక్.

ఇందుకోసమే కేటీఆర్ అమెరికా టూర్ ను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారం కేటీఆర్.. కుమారుడిని గ్రాడ్యుయేషన్ కోర్సులో చేర్పించడానికి గురువారం . ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెళ్లాల్సి ఉన్నది. కానీ ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసే ప్రోగ్రామ్ ఉండడంతో ఆయన చేతులమీదుగానే ఈ వ్యవహారాన్ని నడిపించాలని కేసీఆర్ భావించినందున అమెరికా టూర్‌‌ను వాయిదా వేయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో అప్రకటితంగా రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను చూసుకుంటున్నారు.




Updated : 17 Aug 2023 2:02 PM IST
Tags:    
Next Story
Share it
Top