Home > తెలంగాణ > విషమంగానే తమ్మినేని ఆరోగ్యం..హెల్త్ బులిటెన్ రిలీజ్

విషమంగానే తమ్మినేని ఆరోగ్యం..హెల్త్ బులిటెన్ రిలీజ్

విషమంగానే తమ్మినేని ఆరోగ్యం..హెల్త్ బులిటెన్ రిలీజ్
X

గుండెపోటుకు గురైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం తమ్మినేని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేమని.. వచ్చే 48గంటలు కీలకమన్నారు. బీపీ లెవెల్స్ నిన్నటితో పోలిస్తే ఇవాళ మెరుగయ్యాయని చెప్పారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని.. దానిని తొలగిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నట్లు చెప్పారు.

కాగా మంగళవారం మధ్యాహ్నం ఖమ్మంలోని నివాసంలో ఉండగా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించారు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించారు.

Updated : 17 Jan 2024 10:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top