Home > తెలంగాణ > వాడుకుని మోసం చేశారు.. మా సత్తా చూపిస్తాం.. కేసీఆర్కు కామ్రేడ్ల హెచ్చరిక

వాడుకుని మోసం చేశారు.. మా సత్తా చూపిస్తాం.. కేసీఆర్కు కామ్రేడ్ల హెచ్చరిక

వాడుకుని మోసం చేశారు.. మా సత్తా చూపిస్తాం.. కేసీఆర్కు కామ్రేడ్ల హెచ్చరిక
X

సీఎం కేసీఆర్ తీరుపై వామపక్ష పార్టీలు ఫైర్ అయ్యాయి. కేసీఆర్ తమను వాడుకుని మోసం చేశారని ఆ పార్టీల నేతలు ఆరోపించారు. మునుగోడులో తాము లేకపోతే బీఆర్ఎస్ గెలిచేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ రాజకీయ విధానంతో సమస్య వచ్చింది అని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ తమను అవసరానికి వాడుకుని వదిలేశారని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బీఆర్ఎస్ నిర్ణయంతో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఎక్కడో దోస్తీ కుదిరిందన్నారు. బీజేపీకి దగ్గరైతే.. కేసీఆర్‌ మిత్ర ధర్మం పాటించరా అని ప్రశ్నించారు. తెలంగాణలో సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. లెఫ్ట్ పార్టీలకు బలం లేని చోట ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై ఆలోచిస్తామన్నారు. తమకు బలం లేని స్థానాల్లో ప్రజాతంత్ర శక్తులకు మద్ధతు ఇస్తామన్నారు.

బీజేపీ బీజేపీ దూకుడును నిలువరించాలని మునుగోడులో బీఆర్ఎస్కు మద్ధతు ఇచ్చామని తమ్మినేని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు బీఆర్‌ఎస్‌కు మద్ధతు ఇవ్వాల్సి వచ్చింది. లెఫ్ట్‌పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆరే ప్రకటించారు. ఇప్పుడు ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. మేం కోరిన సీట్లలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది సీట్ల సర్దుబాటు సమస్య కాదు. కేసీఆర్‌ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందేమో అని విమర్శించారు.ఈ నెల 27 తర్వాత వామపక్ష పార్టీలు మరోసారి ఉమ్మడిగా భేటీ అవుతామని, ఆ తర్వాతే కార్యచరణ ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు.

Updated : 22 Aug 2023 1:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top