Home > తెలంగాణ > తెలంగాణలో ఎకరం అమ్మి ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే పరిస్థితి - చంద్రబాబు

తెలంగాణలో ఎకరం అమ్మి ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే పరిస్థితి - చంద్రబాబు

తెలంగాణలో ఎకరం అమ్మి ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే పరిస్థితి - చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్ లో నేరస్థుల పాలన కొనసాగుతోందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు భూముల విలువ ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు తెలంగాణలో భూముల విలువ భారీగా పెరిగిపోయిందని అన్నారు. గతంలో ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనేవారని, అదే ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో 50 నుండి 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. దీనికి కారణం జగన్ అని విమర్శించారు.

ఏపీలో ప్రస్తుతం ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదని చంద్రబాబు వాపోయారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారని, మానసికంగా దెబ్బతీసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఇప్పటికి ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లలో వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరెంటు కోతలే కనిపిస్తున్నాయని ఓపెన్ మార్కెట్‌లో యూనిట్ కరెంటు రూ.10కి కొంటున్నారని, ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Updated : 19 Jun 2023 3:40 PM GMT
Tags:    
Next Story
Share it
Top