Home > తెలంగాణ > మంచి మనిషిని కోల్పోయాం.. గద్దర్ ఇంట్లో చంద్రబాబు

మంచి మనిషిని కోల్పోయాం.. గద్దర్ ఇంట్లో చంద్రబాబు

మంచి మనిషిని కోల్పోయాం.. గద్దర్ ఇంట్లో చంద్రబాబు
X

ఇటీవల కన్నుమూసిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆల్వాల్‌లోని గద్దర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. గద్దర్ భార్య, కొడుకు, కూతుళ్లను ఓదార్చారు. ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని చెప్పారు.

‘‘పేదవాళ్ల సమస్యలు, హక్కులపై గద్దర్‌ గళమెత్తారు. సామాన్య ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయనకు భయమంటే తెలియదు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి శాశ్వతంగా మిగిలిపోతుంది. సమానత్వం కోసం పోరాడిన మంచి మనిషిని మనం కోల్పోయాం’’ అని చంద్రబాబు అన్నారు. గద్దర్ గుండెపోటుతో ఈ నెల 6న గుండెపోటుతో చనిపోవడం తెలిసిందే. కాగా, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1997 ఏప్రిల్ 6న పోలీసులు ఆయనపై కాల్పులు జరిపారు. కొన్ని తూటాలను వైద్యులు తొలగించగా ఒక తూటా ఒంట్లోనే ఉండిపోయింది.

Updated : 15 Aug 2023 1:28 PM IST
Tags:    
Next Story
Share it
Top