Home > తెలంగాణ > Teachers Transfers: ప్రమోషన్లు లేకుండానే టీచర్ల బదిలీలు.. షెడ్యూల్‌ విడుదల

Teachers Transfers: ప్రమోషన్లు లేకుండానే టీచర్ల బదిలీలు.. షెడ్యూల్‌ విడుదల

Teachers Transfers: ప్రమోషన్లు లేకుండానే టీచర్ల బదిలీలు.. షెడ్యూల్‌ విడుదల
X

ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేకుండానే బదిలీలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్‌ను ప్రకటించారు. కోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్‌ అర్హత కేసులుండటం, పదోన్నతులపై స్టే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు మల్టిజోన్‌ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ), మల్టిజోన్‌2 పరిధిలోని జిల్లా పరిషత్తు బడుల్లోని స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) టీచర్ల బదిలీలను చేపట్టనున్నది.

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ) నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)లకు పదోన్నతులను కల్పించాలంటే ఉపాధ్యాయులు టెట్‌ పాసై ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 55వేల మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది టెట్‌ పాసు కాలేదు. దాంతో వీరికి పదోన్నతులను ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పదోన్నతుల ప్రక్రియను పక్కన పెట్టి, కేవలం బదిలీలను నిర్వహించాలని నిర్ణయించారు.

అయితే పదోన్నతులు లేని బదిలీలు తమకొద్దని ఉపాధ్యాయ సంఘాలు తేల్చిచెబుతున్నాయి. కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాతే ప్రత్యేక అనుమతి తీసుకొని బదిలీలు చేపట్టాలని ఈమేరకు ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యాశాఖ ప్రకటించిన బదిలీల షెడ్యూల్‌ను వెంటనే వెనక్కి తీసుకొని హైకోర్టు అనుమతి వచ్చాక పదోన్నతులతో కూడిన టీచర్ల బదిలీల ప్రక్రియను పూర్తిస్థాయిలో జరపాలని తపస్‌, టీఆర్టీఎఫ్‌, డీటీఎఫ్‌, ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి.




Updated : 4 Oct 2023 8:06 AM IST
Tags:    
Next Story
Share it
Top