మహిళాల క్రికెట్లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలి రోజే..!
X
టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు హవా చూపించారు. నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీల సాధించిన ఔరా అనిపించారు. దీంతో టీమిండియా 400 పరుగుల మార్క్ ను దాటింది. కాగా 400 పురుగులు కొట్టిన భారత మహిళల జట్టు చరిత్రకెక్కింది. ఇప్పటివరకు మహిళల టెస్ట్ క్రికెట్ లో ఒకే రోజు 400పైగా పరుగులు సాధించడం ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ పై 431/4 పరుగులు చేసింది.
తొలిరోజు ఇంగ్లాండ్ పై ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియాకు మొదట ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతీ మంధాన (17, 12 బంతుల్లో) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి త్వరగా ఔట్ అయింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (19, 30 బంతుల్లో) క్రీజ్‌లో కుదురుకొనేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత వచ్చిన అరంగేట్ర బ్యాటర్ శుభా సతీష్ (69,76 బంతుల్లో) అద్భుతమైన ఆటతీరును ఆకట్టుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (68, 99 బంతుల్లో)తో కలిసి మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (49, 81 బంతుల్లో) హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. తర్వాత వచ్చిన బ్యాటర్లు యస్తికా భాటియా (66, 88 బంతుల్లో), లోయర్ ఆర్డర్ లో దీప్తి శర్మ (60 నాటౌట్) రాణించడంతో భారీ స్కోర్ దిశగా నడిచింది. చివర్లో స్నేహ రాణా (30, 73 బంతుల్లో) చేయివేయడంతో భారత్ 400 పరుగుల మార్క్ దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2.. కేట్ క్రాస్, ఛార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ తీశారు.