Home > తెలంగాణ > Breaking news: కేసీఆర్ హెలిక్యాప్టర్లో సాంకేతిక సమస్య

Breaking news: కేసీఆర్ హెలిక్యాప్టర్లో సాంకేతిక సమస్య

Breaking news: కేసీఆర్ హెలిక్యాప్టర్లో సాంకేతిక సమస్య
X

బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభకు బయలుదేరిన సీఎం కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. మహబూబ్నగర్లోని దేవరకద్ర సభకు బయలుదేరిన కేసీఆర్ ప్రత్యేక హెలిక్యాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. అది గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి.. హెలిక్యాప్టర్ ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో సభ ఆలస్యంగా ప్రరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏవియేషన్ అధికారులకు సమాచారం అందిచడంతో.. వారు మరో హెలిక్యాప్టర్ ను కేసీఆర్ కు ఏర్పాటుచేశారు. గత 25 రోజులుగా కేసీఆర్ అదే హెలిక్యాప్టర్ లో సభలకు హాజరవుతున్నారు. దాదాపు 57 సభలకు అదే హెలిక్యాప్టర్ ను వాడుతున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ లో జరిగే నాలుగు సభలకు కూడా అదే హెలిక్యాప్టర్ లో బయలుదేరడంతో సాంకేతిక లోపం తలెత్తింది.




Updated : 6 Nov 2023 1:40 PM IST
Tags:    
Next Story
Share it
Top