Home > తెలంగాణ > మొరాయించిన ఈవీఎంలు.. క్యూలైన్లలో ఓటర్ల పడిగాపులు

మొరాయించిన ఈవీఎంలు.. క్యూలైన్లలో ఓటర్ల పడిగాపులు

మొరాయించిన ఈవీఎంలు.. క్యూలైన్లలో ఓటర్ల పడిగాపులు
X

తెలంగాణవ్యాప్తంగా పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. అయితే కొన్నిచోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అక్కడ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల ఇంకా ఈవీఎంలను సరిచేస్తున్నారు. దీంతో క్యూలైన్లలో నిలబడ్డి ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పల్లోని ఓ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు మొరాయించాయి. చిలుకానగర్ సెయింట్ మార్క్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 380లో ఈవీఎంలు పనిచేయలేదు. పోలింగ్ ప్రారంభమై గంట దాటినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పోలింగ్ కేంద్రం బయట ఓటర్లు పడిగాపులు కాస్తున్నారు.

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ ప్రారంభమై గంట గడిచినా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ పోలింగ్‌ బూత్‌ 153లో ఈవీఎం మొరాయించింది. తక్షణమే స్పందించిన అధికారులు దానిని సరి చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం రెజిమెంటల్ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 209లో పనిచేయకపోవడంతో ఓటింగ్ ఇంకా ప్రారంభంకాలేదు. దాదాపు గంటన్నర గడుస్తున్నా ఇంకా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓటర్లు ఇబ్బందులుపడుతున్నారు.

ఇంకా ప్రారంభం కానీ ఓటింగ్ ప్రక్రియ.

Updated : 30 Nov 2023 8:34 AM IST
Tags:    
Next Story
Share it
Top