దివ్యాంగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..5 శాతం రిజర్వేషన్లు
X
తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4 శాతం విద్యా, ఉద్యోగ అవకాశాల్లో అన్ని సంక్షేమ పథకల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను సిద్దం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాన్స్‌జెండర్లను గవర్నమెంట్ స్కీమ్‌లు వర్తించేలా, వారికి సరైన అవకాశలు కల్పించేందుకు ప్రత్యేక విధానాన్ని తయారు చేయాల్సి ఉందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు. ట్రాన్స్ జెండర్లకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లోనే వారికి చికిత్సలు చేస్తున్నారనే చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ అన్నిట్లో ట్రాన్స్ జెండర్లకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.
ప్రభుత్వ పథకాలన్నీ వారికి వర్తించేలా, వారికి సరైన అవకాశాలు కల్పించేందుకు, సంక్షేమానికి వీలుగా ప్రత్యేక విధానాన్ని తయారు చేయాల్సి ఉందని అన్నారు.ఇటీవలే దివ్యాంగుల పెన్షన్లను పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం 4 వేలకు పెంచింది. ఇదిలా ఉండగానే వారికి మరో శుభవార్త అందించింది సర్కార్. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు అందించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలోని 4 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.