Home > తెలంగాణ > అక్బరుద్దీన్ నియమాకంపై గవర్నర్‌కు బీజేపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

అక్బరుద్దీన్ నియమాకంపై గవర్నర్‌కు బీజేపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

అక్బరుద్దీన్ నియమాకంపై గవర్నర్‌కు బీజేపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
X

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నియామకంపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. సభలో అక్బరుద్దీన్‌కన్నా సీనియర్లు ఐదుగురు ఉన్నప్పటికీ వాళ్లను కాదని రాజ్యాంగ విరుద్ధంగా నియామకం జరిపారని ఆరోపించారు. స్పీకర్ వచ్చాకే తాము ప్రమాణం చేస్తామన్నారు.

తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎంఐఎంల అనుబంధానికి ప్రొటెం స్పీకర్ నియామకమే నిదర్శనమన్నారు. బొటాబొటి మెజారిటీ దక్కించుకున్న కాంగ్రెస్ అధికారం కాపాడుకోవడానికి మజ్లిస్‌ను మచ్చిక చేసుకుంటోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ అయితే తను ప్రమాణం చేయబోనని మొదట గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తర్వాత మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలో నడిచారు. 15 నిమిషాలపాటు పోలీసులు తమను స్వేచ్ఛగా వదిలిపెడితే 100 కోట్ల మందిని అంతమొందిస్తానని సవాల్ విసిరిన అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌ను చేయడం సరికాదని రాజా సింగ్ అన్నారు.

Updated : 9 Dec 2023 9:52 PM IST
Tags:    
Next Story
Share it
Top