Home > తెలంగాణ > Telangana Assembly Polling: ఓట్ల లెక్కింపు.. మరో 3 గంటల్లో తొలి ఫలితం?

Telangana Assembly Polling: ఓట్ల లెక్కింపు.. మరో 3 గంటల్లో తొలి ఫలితం?

Telangana Assembly Polling: ఓట్ల లెక్కింపు.. మరో 3 గంటల్లో తొలి ఫలితం?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో యావత్ తెలంగాణ ప్రజానీకం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయంపై బీఆర్ఎస్.. ప్రత్యేక రాష్ట్రం తమ వల్లే సాధ్యమైందటున్న కాంగ్రెస్.. ఇక్కడ అధికారం సాధించి తెలుగు రాష్ట్రాల్లో బోణీ కొట్టాలన్న బీజేపీ.. కన్నేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీల భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది. రాష్ట్రంలోని 35,655 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలో నమోదైన ఓట్లను కొద్దిసేపట్లోనే లెక్కించనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లోని భద్రాచలం, చార్మినార్‌ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం తొలుత వెలువడవచ్చని అంచనా. చార్మినార్‌లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉన్నందున దాని ఫలితమే మొదట తెలుస్తుందని భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఫలితాలు వరుసగా వెలువడే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రంలోని శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఎల్బీనగర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అక్కడి ఫలితాల వెల్లడికి అధిక సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కోచోట 500 నుంచి 600 వరకు పోలింగ్‌ కేంద్రాలు ఉండటమే దీనికి కారణం. అత్యధిక నియోజకవర్గాలకు 14 లెక్కింపు టేబుల్స్‌ చొప్పున ఏర్పాటు చేయగా ఈ ఆరు స్థానాల కోసం 28 టేబుల్స్‌ చొప్పున ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్‌లో 6,99,130 మంది ఓటర్లుండగా.. 3,99,752 మంది ఓటు వేశారు. అత్యధిక ఓట్లు పోలైన నియోజకవర్గం ఇదే. మేడ్చల్‌లో 6,37,839 మంది ఓటర్లకుగాను 3,96,752 మంది ఓటు వేశారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో మూడు లక్షలకు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది.

భద్రాచలంలో 1,17,447, అశ్వారావుపేటలో 1,35,497 మంది ఓట్లు వేశారు. చార్మినార్‌ నియోజకవర్గంలో 94,830 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అందువల్ల రౌండ్ల సంఖ్య తక్కువగా ఉన్న భద్రాచలం కంటే చార్మినార్‌ ఫలితమే ముందుగా వెలువడుతుందని అంచనా. మధ్యాహ్నం 1 గంటలోపు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక అబ్జర్వెర్ ను, ప్రతి టేబుల్‌కు మరో అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. లెక్కింపు కోసం ప్రతి టేబుల్‌కు ఒక పరిశీలకుడితోపాటు నలుగురు అధికారులను కేటాయించింది. ప్రతి రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయి.. సదరు అధికారి ఆమోదించిన తరువాతే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ప్రకటించాలని నిర్ణయించారు.

Updated : 3 Dec 2023 7:16 AM IST
Tags:    
Next Story
Share it
Top