Home > తెలంగాణ > జమిలి ఎన్నికలపై క్లారిటీ.. రాష్ట్రంలో ఎలక్షన్స్ అప్పుడేనన్న వికాస్ రాజ్

జమిలి ఎన్నికలపై క్లారిటీ.. రాష్ట్రంలో ఎలక్షన్స్ అప్పుడేనన్న వికాస్ రాజ్

జమిలి ఎన్నికలపై క్లారిటీ.. రాష్ట్రంలో ఎలక్షన్స్ అప్పుడేనన్న వికాస్ రాజ్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. బీఆర్కే భవన్లో శనివారం మీడియా సెంటర్ ప్రారంభించిన వికాస్ రాజ్ ఆ తర్వాత ఎన్నికల అంశంపై మాట్లాడారు. ఎన్నికలకు ఇంకా 2 -3 నెలల సమయం మాత్రమే ఉందని చెప్పారు. ఎలక్షన్ల ప్రాసెస్కు సంంబంధించి జిల్లాల్లో అధికారులకు ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు.

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని, రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వాహణ జరుగుతుందని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. అక్టోబర్‌ 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుందని చెప్పారు. ప్రస్తుతం ఈవీఎంల తనిఖీ జరుగుతోందని, తుది ఓటర్ల జాబితా పూర్తయ్యాక జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహిస్తామన్న ఆయన.. కేంద్ర, రాష్ట్ర పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇందులో భాగస్వామ్యమవుతాయని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 15లక్షల మంది ఓటర్లుగా చేరినట్లు వికాస్ రాజ్ చెప్పారు. యువత, మహిళా ఓటర్ల నమోదుపై ప్రధానంగా దృష్టి సారించామని అన్నారు. ఇప్పటి వరకు 6.99 లక్షల మంది యువ ఓటర్లను నమోదు చేయించినట్లు చెప్పారు.

Updated : 23 Sept 2023 4:36 PM IST
Tags:    
Next Story
Share it
Top