కామారెడ్డిలో కాంగ్రెస్..ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ ముందంజ
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్ షురూ అయ్యింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన 2290 మంది అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ కన్నేయగా.. ఈసారి అధికారం చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఇక బీజేపీ సైతం తమ గెలుపు ఖాయమని అంటోంది.
కామారెడ్డిలో కాంగ్రెస్ ముందంజ :
ఇక కామారెడ్డిలో తొలి రౌండులో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ కు 3543 ఓట్లు రాగా, బీజేపీకి 2766 ఓట్లు ,బీఆర్ఎస్ కు 2723 ఓట్లు నమోదు అయ్యాయి. 777 ఓట్లతో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ ముందంజ :
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో 471 ఓట్లతో ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్లో
బీఆర్ఎస్ కు 3288 ఓట్లు రాగా బీజేపీలో 2817 ఓట్లను దక్కించుకుంది, ఇక కాంగ్రెస్ కు 1482 ఓట్లు వచ్చాయి.
ఖమ్మంలో కాంగ్రెస్ హవా :
ఖమ్మంలో కౌంటింగ్‌లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తొలి రౌండ్లో 126 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
మొదటి రౌండ్లో కాంగ్రెస్‌కు 5519 ఓట్లు రాగు బీఆర్ఎస్ కు 5393 ఓట్లు వచ్చాయి.