తొలిసారి ఓటేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
Veerendra Prasad | 29 Nov 2023 9:05 AM IST
X
X
ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు తొలి ఓటర్లు ఎదురుచూస్తున్నారు. ఈనెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసేందుకు యువతరం ఉవ్విళ్లూరుతుంది. రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 8లక్షల 11వేల 640మంది ఉన్నారు. ఇందులో గ్రేటర్ పరిధిలో లక్షా 70 వేలమంది ఓటర్లున్నారు. రంగారెడ్డిలో అత్యధికంగా 92వేల 540మంది, హైదరాబాద్ లో 77వేల 522మంది రానున్న ఎన్నికల్లో పాల్గొనున్నారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు.మొదటిసారి ఓటేయబోతున్న యువతరం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..
- పోలింగ్ స్టేషన్ కు వెళ్లే ముందు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. దాని కోసం ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు దగ్గర్లోని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
- ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మీదగ్గర ఏదో ఒక ఐడీ కార్డు ఉండాలి. అది ఓటర్ ఐడీ కార్డు కానీ.. లేదా పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు పాస్ బుక్, పోస్ట్ ఆఫీసు పాస్ బుక్, ప్రభుత్వ ఉద్యోగి అయితే.. ఎంప్లాయి ఐడీలో ఏదో ఒకటి తీసుకెళ్లొచ్చు. దాంతో పాటు ఓటరు స్లిప్ కూడా తీసుకెళ్లండి. మీకు ఓటరు స్లిప్ ఎవరూ ఇవ్వకపోతే.. పోలింగ్ బూత్ వద్ద ఉండే కౌంటర్లలో తీసుకోవచ్చు.
- పోలింగ్ కేంద్రంలో మొదటి అధికారి జాబితాలో మీ పేరును పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉంటే రెండో అధికారి దగ్గరకు పంపుతారు.
- రెండో అధికారి మీ వేలుకు ఇంక్ అంటించి, చీటి ఇస్తారు.
- ఆ చీటిని మూడో అధికారి పరిశీలిస్తారు. అనంతరం ఈవీఎం దగ్గరకు పంపుతారు
- ఈవీఎంలో బటన్ నొక్కగానే బీప్ అనే పెద్దగా శబ్ధం వస్తుంది. లేదంటే అధికారికి సమాచారం ఇవ్వాలి
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- సెల్ ఫోన్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లొద్దు
- అక్రమంగా తీసుకెళ్లి సెల్ఫీ తీసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసే అవకాశముంది. ఓటును లెక్కించరు
- పోలింగ్ కేంద్రంలో కెమెరాలతో ఫోటోలు తీయకూడదు. ల్యాప్ టాప్‌ను కూడా అనుమతించరు
- ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పు, ఏదైనా గుర్తింపు కార్డును పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి
Updated : 29 Nov 2023 9:05 AM IST
Tags: awareness for first time voters telangana assembly elections 2023 vote process for first time voters Telangana state ts elections ts politics telangana elections telangana politics assembly elections Polling Date TS Polling 2023 Election Commission
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire