Home > తెలంగాణ > ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
X

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి షురూ కానున్నాయి. నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 11.30కు ఉభయసభలు ప్రారంభమవుతాయి. శాసనసభ ప్రారంభమయ్యాక కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతికి సంతాపం తెలుపుతారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి సభ నిర్వాహణ, సభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.

మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో కేసీఆర్ సర్కార్కు ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు. దీంతో అధికార, విపక్ష పార్టీలు తమ వాణిని గట్టిగా వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులను అధికారం పార్టీ చెప్పనుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. వరదలు, పంట నష్ట పరిహారం, వరద బాధితులకు పరిహారం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.





మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆర్టీసీ బిల్లు సహా పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఇక శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీ వేదల వెంకటనర్సింహాచారి మృతికి సంతాపం తెలపనున్నారు. అనంతరం ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, చేపట్టిన సహాయ చర్యలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అనంతరం చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించి.. మండలి నిర్వాహణ, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయిస్తారు.







Updated : 3 Aug 2023 8:24 AM IST
Tags:    
Next Story
Share it
Top