ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
X
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్షన్ కమిషన్ రెండు సీట్లకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. ఇవాళ్టి నుంచి నామినేష్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరణ జరగనుంది. 19న నామినేష్ల పరిశీలించనున్నారు. ఈ నెల 22 వరకు వాటిని ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. జనవరి 29న పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో 2 చోట్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యా బలం దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి.