Home > తెలంగాణ > ఆర్టీసీ బిల్లుపై చర్చ.. అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు

ఆర్టీసీ బిల్లుపై చర్చ.. అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు

ఆర్టీసీ బిల్లుపై చర్చ.. అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. ఇవాళ్టితో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావించిన.. టీఎస్ఆర్టీసీ బిల్లు నేపథ్యంలో మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ నడవనుంది. ఎట్టకేలకు గవర్నర్ తమిళిసై ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం కాసేపట్లో సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది.

గత రెండు రోజులుగా బిల్లుపై సందేహాలు వ్యక్తం చేసిన గవర్నర్.. ఇవాళ ఆర్టీసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తనకున్న ప్రశ్నలను లేవనెత్తగా.. అధికారులు వివరణ ఇచ్చారు. ఆ తరువాత కొద్దిసేపటికే బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆర్టీసీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. అంతకుముందు మీడియాతో మాట్లాడిన గవర్నర్.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.



Updated : 6 Aug 2023 3:23 PM IST
Tags:    
Next Story
Share it
Top