Home > తెలంగాణ > తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
X

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. స్పీకర్‌ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్‌ కాసేపటి క్రితం నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. దీని ప్రకారం.. స్పీకర్‌ పదవికి పోటీపడే వారు ఈ నెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్లు వేయాలని.. ఈ నెల 14న(బుధవారం) ఎన్నిక జరగనుందని తెలిపింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్‌ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీ తరపున ఒక్క నామినేషన్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎవరైనా ఇతర సభ్యులు పోటీలో ఉంటే బ్యాలెట్‌ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్‌ ఆధ్వర్యంలో స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

ఇదిలా ఉంటే.. రెండ్రోజుల క్రితం నూతనంగా ఎన్నికైన శాసన సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐకు చెందిన మొత్తం 101 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీకి చెందిన 8 మంది శాసన సభ్యులు ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. వారంతా కూడా పూర్తి స్థాయి స్పీకర్ ఎన్నిక తరువాత ఆ స్పీకర్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Updated : 11 Dec 2023 7:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top