Home > తెలంగాణ > Telangana Auto Drivers : మా ఆటోలను ప్రభుత్వానికి ఇచ్చేస్తాం.. ఆటో డ్రైవర్ల డిమాండ్

Telangana Auto Drivers : మా ఆటోలను ప్రభుత్వానికి ఇచ్చేస్తాం.. ఆటో డ్రైవర్ల డిమాండ్

Telangana Auto Drivers :  మా ఆటోలను ప్రభుత్వానికి ఇచ్చేస్తాం.. ఆటో డ్రైవర్ల డిమాండ్
X

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై ఆటోడ్రైవర్లు మండిపడుతున్నారు. ‘మహాలక్ష్మి’ పథకం వల్ల ఆడవాళ్లు ఆటోలు ఎక్కడం లేదని, తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను ఆదుకున్న ప్రభుత్వం తమకు కూడా ఏదో ఒక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు ‘మహాలక్ష్మి’ పథకానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోకపోతే కనీసం తమ ఆటోలను ప్రభుత్వం సంస్థల్లో పెట్టుకోవాలని కోరుతున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు శుక్రవారం పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిచారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే భారీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ‘ప్రజా భవన్‌ను, అసెంబ్లీని ముట్టడిస్తాం. ఇది రాజకీయ పార్టీల వ్యవహారం కాదు. 8 లక్షల మంది బతుకు తెరువు సమస్య. మహిళలకు మేలు చేయడానికి మా జీవితాలను నాశనం చేయొద్దు’’ అని అంటున్నారు.

‘‘మహాలక్ష్మి పథకం రాకముందు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించేవాళ్లం. ఇప్పుడు 300 కూడా రావడం లేదు. ఆ 300 కూడా డీజిల్ చార్జలకే సరిపోవడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని అమలుచేయాలనుకుంటే తమకు ఆర్థిక సాయం చేసి, ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గించాలని కోరుతున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం రవాణా చట్టాన్ని తుంగల్లో తొక్క ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులను తీసుకొచ్చి తమను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చావుదెబ్బ కొట్టిందని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే 18వ తేదీన బస్సు డిపోల వద్ద ధర్నా చేస్తామని, 19న కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాసంఘాలకు సమస్యలను వివరించి భారీ ఆందోళన చేపడతామన్నారు.


Updated : 15 Dec 2023 10:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top