Home > తెలంగాణ > తెలంగాణ బీజేఎల్పీ నేతపై వీడిన ఉత్కంఠ.. ఎవరంటే..?

తెలంగాణ బీజేఎల్పీ నేతపై వీడిన ఉత్కంఠ.. ఎవరంటే..?

తెలంగాణ బీజేఎల్పీ నేతపై వీడిన ఉత్కంఠ.. ఎవరంటే..?
X

తెలంగాణ బీజేఎల్పీ నేత ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడింది. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేతగా ఎంపికయ్యారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్, వెంకటరమణా రెడ్డి నియామకమయ్యారు. ఇక బీజేపీ చీఫ్ విప్గా పాల్వాయి హరీష్ బాబు, విప్గా సూర్యనారాయణలను ఎంపిక చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి బీజేపీ లేఖను అందజేసింది. బీఆర్ఎస్ హయాంలో బీజేఎల్పీ లీడర్గా ఉన్న రాజాసింగ్ను పార్టీ ఈ సారి పక్కనబెట్టింది.

ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్నాయి. బీజేపీ మాత్రం ఫ్లోర్ లీడర్ లేకుండానే సమావేశాల్లో పాల్గొంటుంది. మహేశ్వర్ రెడ్డితో పాటు వెంకటరమణా రెడ్డి, రాజాసింగ్, పాయల్ శంకర్ బీజేఎల్పీ నేత పదవిని ఆశించారు. దీంతో ఎవరినీ ఎంపిక చేయాలన్నదానిపై కమలం పార్టీ మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు మహేశ్వర్ రెడ్డిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది.


Updated : 14 Feb 2024 3:27 PM IST
Tags:    
Next Story
Share it
Top