BJP : కాంగ్రెస్ రూట్లో బీజేపీ.. సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్న కమలదళం
X
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ కాంగ్రెస్ ఫార్ములానే బీజేపీ ఫాలో కానుంది. పార్టీ టికెట్ కోరుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాంపల్లిలోని పార్టీ హెడ్ క్వార్టర్స్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పార్టీ సభ్యులు ఎవరైనా సరే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలను అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రూట్లోనే వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. గతంలో నియోజకవర్గాల్లో బలమైన నేతలు, లాబీయింగ్ చేసిన లీడర్లకు టికెట్లు కేటాయించేవారు. కానీ తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ ఎన్నికల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పుడు బీజేపీ సైతం అదే బాటలో నడుస్తోంది.