Home > తెలంగాణ > బీజేపీలో భారీగా ఆశావహులు.. ఎంపీ టికెట్ దక్కేదెవరికో..?

బీజేపీలో భారీగా ఆశావహులు.. ఎంపీ టికెట్ దక్కేదెవరికో..?

బీజేపీలో భారీగా ఆశావహులు.. ఎంపీ టికెట్ దక్కేదెవరికో..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితమైన బీజేపీ ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్లపై దృష్టి సారించింది. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెల్చుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్న ఆ పార్టీ పనిలో పనిగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఈసారి ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్లతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు కూడా టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే నలుగురు సిట్టింగులతో పాటు మందకృష్ణ మాదిగకు టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే నిర్ణయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే అసెంబ్లీ తరహాలోనే లోక్సభ ఎన్నికల్లోనూ బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. 50శాతం మంది అభ్యర్థులు ఇప్పటికే ఫిక్స్ అయ్యారని, నోటిఫికేషన్కు ముందే క్యాండిడేట్లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రం ఇంఛార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ నేతృత్వంలో స్టేట్ ఎలక్షన్ టీం సమావేశం కానుంది. ఈ భేటీలో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎంపీ ఎన్నికల్లో జనసేన సహా ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో దిగాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా.. ఆశావాహుల లిస్టు కూడా భారీగానే ఉంది. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురికిపైగా నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాలవారీగా టికెట్ ఆశిస్తున్న వారి వివరాలు పరిశీలిస్తే..

మల్కాజిగిరి - ఈటల రాజేందర్, పన్నాల హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, మురళీధర్ రావు

నిజామాబాద్ - ధర్మపురి అర్వింద్, యెండల లక్ష్మీనారాయణ, బస్సా లక్ష్మీ నారాయణ (బీజేపీ జిల్లా అధ్యక్షుడు), అలూర్ విజయభారతి రెడ్డి(NRI)

హైదరాబాద్ - విక్రమ్ గౌడ్, కొంపెల్ల మాధవీలత, డా. భగవంతరావు

జహీరాబాద్ - చీకోటి ప్రవీణ్, ఆలె భాస్కర్, ఏలేటి సురేశ్ రెడ్డి, అశోక్

కరీంనగర్ - బండి సంజయ్

వరంగల్ - రిటైర్డ్ IPS కృష్ణ ప్రసాద్, డా. విజయ రామారావు, మంద కృష్ణమాదిగ

చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీరేందర్ గౌడ్, సుదర్శన్ ప్రసాద్ తివారి

సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి

మహబూబాబాద్ (ST) - జాటోత్ హుస్సేన్ నాయక్, (గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు), రవీంద్ర నాయక్, రామచంద్రు తెజావత్, దిలీప్ నాయక్

భువనగిరి - పీవీ శ్యాంసుందర్ రావు, డా. బూర నర్సయ్య గౌడ్

మెదక్ - నందీశ్వర్ గౌడ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, నరేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ - డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంత కూమార్, తల్లోజు ఆచారి, దిలీప్ ఆచారి

ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి రామ్మెహన్ రావు

నాగర్ కర్నూల్ - బంగారు శృతి, పోతుగంటి భరత్ ప్రసాద్

ఆదిలాబాద్ - సోయం బాపురావు, రాథోడ్ బాపూ రావు, రమేశ్ రాథోడ్

నల్గొండ - సంకినేని వెంకటేశ్వరరావు, నూకల నర్సింహ రెడ్డి, మన్నెరంజిత్ యాదవ్, నాగం పర్షీత్ రెడ్డి, బండారు ప్రసాద్, కస్తూరి చరణ్, గార్ల జితేందర్

పెద్దపల్లి - కుమార్, కాశిపేట లింగయ్య, బొడిగె శోభ

ఆశావహుల్లో ఎవరికి టికెట్ దక్కుతుందన్నది త్వరలోనే తేలనుంది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్కు ధీటుగా వ్యూహాలు రచిస్తోంది. ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 9 Jan 2024 6:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top