Home > తెలంగాణ > కారు’ ఎక్కనున్న మరో తెలంగాణ బీజేపీ పెద్ద చేప!

కారు’ ఎక్కనున్న మరో తెలంగాణ బీజేపీ పెద్ద చేప!

కారు’ ఎక్కనున్న మరో తెలంగాణ బీజేపీ పెద్ద చేప!
X

ఒపీనియన్ చేంజ్ చేయని వాడు రాజకీయ నాయకుడు కాదని సామెత. అది పాతకాలం సామెత. పార్టీ మారని వాడు రాజకీయ నాయకుడు కాదన్నది మనకాలం సామెత. ముఖ్యంగా ఎన్నికలు తరుముకొస్తున్నవేళ గాలివాటం బట్టి రూట్ మార్చాలి. ‘కీలకపదవి’, ‘విన్నింగ్ చాన్స్’ ఎక్కడ ఉంటే అక్కడికి జంప్ జిలానీ అనేయడమే అత్యంత ఉత్తమ మార్గం. తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. అంటు బీఆర్ఎస్ హవా, ఇటు మెల్లగా జూలు విదిలిస్తున్న కాంగ్రెస్‌లను తట్టుకుని పార్టీ గట్టిగా తలపడే అవకాశాలు కనిపిస్తున్నా ప్రాధాన్యం దక్కని నేతలు ‘మాకేమిటి?’ అని అసంతృప్తితో రగిలిపోతున్నారు.

పార్టీ సరే, మాకేమిటి?

త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ గత ఎన్నికలంటే మరిన్ని సీట్లు గెలిచే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోకి చేరికలు ఊపందడంతో ఆ పార్టీ కూడా రంకెలు వేస్తోంది. ఇక రాష్ట్ర బీజేపీ నాయకత్వమే ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకుని ఇంటిని దిద్దుకునే పనిలో ఉంది. ఎన్నికల్లో తమకు ప్రాధన్యామిస్తారని ఆశలు పెట్టుకున్న నేతలు పార్టీ తాజా నిర్ణయంతో నీరుగారిపోయారు. బండి సంజయ్‌ని రాష్ట్ర చీఫ్ పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డిని తీసుకురావడం, ఈటలకు ఎన్నికల కమిటీని అప్పగించంపై నేతలు మండిపడుతున్నారు. పదవులే కాదు, తాము ఆశించిన టికెట్లు కూడా దక్కవనే ఆందోళన మొదలైంది. బీజేపీకి సొంత పేపర్, టీవీ చానల్ లేని కొరత తీరుస్తున్న ప్రముఖ మీడియా సంస్థ అధినేత, బడుగువర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ పార్టీ మారుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ అణచివేతలతో నష్టపోతున్న తనకు కమల నేతలు అండగా నిలుస్తారనే ఆశ కనిపించకపోవడం, ఈటల రాజేందర్ హవా పెరగడంతో ఆయన విధిలేని పరిస్థితిలో కారెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పోలీస్తే బీఆర్ఎసే తనకు బెటర్ ఆప్షన్ అన్నది ఆయన ఆలోచన. తన మీడియా సంస్థలు, నిర్మాణ కార్యకలాపాలు నిరాంటకంగా సాగాలన్నా, ప్రాధాన్యమున్న పదవి దక్కాలన్నా గులాబీ కండువాతోనే సాధ్యమని భావిస్తున్న ఆయన ఈ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం.

ఎక్కడి నుంచి...?

రాజకీయాలకు, వ్యాపారాలకు అవినాభావం సంబంధం కనుక తను కచ్చితంగా పదవిలో ఉంటేనే సంస్థలను నడిపించడం, తనను నమ్ముకున్న వారిని కాపాడుకోవడం సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు చెబుతుండడంతో దానివైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీకి కంచి గరుడ సేవ చేసే బదులు, కాంగ్రెస్‌లో చేరి మదగజాల కింద నగిలే బదులు కాస్త తలొగ్గి సాగితే బీఆర్‌ఎసే తనకు సేఫ్ అని లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఖారారు చేసుకుని త్వరలోనే తీర్థం పుచ్చుకుంటారని భోగట్టా. పెద్దపల్లి ఎంపీ టికెట్ లేకపోతే బెల్లంపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇటీవల లైంగిక వేధిపుల బాగోతంలో చిక్కుకోవడంలో బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని వార్తలు వస్తున్నాయి. ఆయనకు బదులు సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకు టికెట్ ఇస్తారని టాక్. కాంగ్రెస్ తరఫున తన సొంత సోదరుడు అక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉండడంతో బెల్లంపల్లిని వదిలేసి ధర్మపురి నుంచి పోటీ చేస్తే బావుంటుందని భావిస్తున్నారు. ధర్మపురి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ప్రజల్లో వ్యతిరేకంత ఉందని బీఆర్ఎస్ అంతర్గత సర్వేలో తేలిందని చెబుతున్నారు. ఏ సమీకరణాలు ఎలా ఉన్నా, తనకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లలో ఏదో ఒకటి ఇచ్చే హామీపైన ఆయన ‘కారు’ ఎక్కబోతున్నట్లు లీకులు వదులుతున్నారు.


Updated : 4 July 2023 8:46 PM IST
Tags:    
Next Story
Share it
Top