Home > తెలంగాణ > తెలంగాణ బీజేపీ దూకుడు.. రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభం

తెలంగాణ బీజేపీ దూకుడు.. రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభం

తెలంగాణ బీజేపీ దూకుడు.. రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభం
X

తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెల్చుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్న ఆ పార్టీ పనిలో పనిగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో రాష్ట్రస్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి రాష్ట్రం ఇంఛార్జులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల్లో 10 ఎంపీ స్థానాలే లక్ష్యంగా ఆ పార్టీ నేతల ప్రణాళికలు రచిస్తోన్నారు. పార్టీ బలోపేతం కోసం వేసిన 10 కమిటీలతో రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ సహా అరవింద్ మీనన్ వేర్వేరుగా సమావేశమవుతున్నారు. పీఎం విశ్వకర్మ యోజన, వికసిత్‌ భారత్, నవయువ ఓటర్స్, కమల్ వికాస్ సహా 10 కమిటీలను కమలం పార్టీ నియమించింది. ఇదే క్రమంలో సోమవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. లోక్ సభ ఎన్నికల వ్యూహాలు, కార్యక్రమాల రూట్ మ్యాప్‌ సిద్ధంపై నేతలు చర్చించనున్నారు.


Updated : 7 Jan 2024 10:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top