Home > తెలంగాణ > బీజేపీకి షాక్.. కాంగ్రెస్లోకి బీజేవైఎం కోశాధికారి..!

బీజేపీకి షాక్.. కాంగ్రెస్లోకి బీజేవైఎం కోశాధికారి..!

బీజేపీకి షాక్.. కాంగ్రెస్లోకి బీజేవైఎం కోశాధికారి..!
X

హైదరాబాద్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేవైఎం కోశాధికారి రఘునాథ్ యాదవ్ హస్తం గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటీ, జూపల్లి మొదట బీజేపీలో చేరుతానే ఊహాగానాలు వచ్చినా.. చివరకు వారు కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయ్యారు. వారితో పాటే శేరిలింగపల్లికి చెందిన రఘునాథ్ యాదవ్ జాయిన్ అవుతుండడంతో బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి.

రేవంత్ రెడ్డి సమక్షంలో రఘునాథ్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. 100మంది అనుచరులతో ఆయన కాంగ్రెస్లో చేరనున్నారు. గతంలో కొండాపూర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. యూత్ కెన్ లీడ్ ఆర్గనైజేషన్ను నడుపుతున్నాడు. ఇటీవలె రఘునాథ్ యాదవ్ నిర్వహించిన యూత్ కెన్ లీడ్ సమ్మిట్కు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 21 Jun 2023 9:41 AM IST
Tags:    
Next Story
Share it
Top