Home > తెలంగాణ > TS Intermediate : ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల

TS Intermediate : ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల

TS Intermediate : ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల
X

ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచారు. విద్యార్ధులే నేరుగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని ఎగ్జామ్కు హాజరుకావచ్చు. ఈ నెల 28 నుంచి మార్చ్ 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీలలో ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్ tsbie.cgg.gov.in. ఓపెన్ చేసి విద్యార్థి పుట్టిన తేదీ లేదా గతేడాది హాల్ టికెట్ వివరాలు ఎంటర్ చేస్తే హాల్ టికెట్ కన్పిస్తుంది. దాన్ని నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లలో ఫోటోలు, సంతకాలు ఇతర వివరాల్లో తప్పులేమైనా ఉంటే కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దుకునే సౌకర్యం కల్పించారు.

ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1521 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ టైమ్ టేబుల్

ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్

మార్చ్ 1న ఇంగ్లీషు

మార్చ్ 4న మేధ్స్-బోటనీ-పొలిటికల్ సైన్స్

మార్చ్ 6న మేధ్స్-జువాలజీ-హిస్టరీ

మార్చ్ 11న ఫిజిక్స్-ఎకనామిక్స్

మార్చ్ 13న కెమిస్ట్రీ-కామర్స్

మార్చ్ 15న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-బ్రిడ్జి కోర్సు మేథ్స్-1

మార్చ్ 18న మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ-1

ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ టైమ్ టేబుల్

ఫిబ్రవరి 29న సెకెండ్ లాంగ్వేజ్

మార్చ్ 2న ఇంగ్లీషు

మార్చ్ 5న మేథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్

మార్చ్ 7న మేధ్స్ 2బి, జువాలజీ, హిస్టరీ

మార్చ్ 12న ఫిజిక్స్, ఎకనామిక్స్

మార్చ్ 14వతేదీన కెమిస్ట్రీ, కామర్స్

మార్చ్ 16న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్ మేధ్స్-2

మార్చ్ 19న మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ

Updated : 19 Feb 2024 2:35 PM IST
Tags:    
Next Story
Share it
Top