Home > తెలంగాణ > Breaking News : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Breaking News : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Breaking News : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
X

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ సర్కారు డిసైడైంది. వచ్చేఅసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టనున్నారు. ఆగస్టు 3న ప్రారంభం కానున్న సమావేశాల్లో టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లును ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందాలని నిర్ణయించారు.

ప్రభుత్వ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఆర్టీసీని కాపాడటంతో పాటు ప్రజారవాణాను మరింత పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి విధివిధానాలు రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీలైనంత తొందరగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారని అన్నారు.


Updated : 31 July 2023 8:51 PM IST
Tags:    
Next Story
Share it
Top