Telangana cabinet: నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటి
X
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు(2023 డిసెంబర్ 9)న తొలి కేబినెట్ మీటింగ్ జరగ్గా... నేడు రెండోసారి మంత్రివర్గం భేటీ కానుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించబోయే ఈ సమావేశంలో... కాంగ్రెస్ ప్రభుత్వ నెల రోజుల పాలన, ఆరు గ్యారంటీల అమలుపై చర్చించనున్నారు. అంతేకాకుండా ప్రజాపాలనలో అందిన ధరఖాస్తులు, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం మిగిలిన నాలుగు గ్యారంటీల అమలుపై కూడా చర్చించనున్నారు. క్యాబినెట్‌లో పలు ఇతర అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌ల నియామక ప్రక్రియను మంత్రివర్గం వేగవంతం చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ రోజే 'ప్రజాపాలన' కోసం ప్రత్యేక వెబ్‌సెట్ ను ప్రారంభించనున్నట్లు సమాచారం.