Home > తెలంగాణ > తెలంగాణ ఎన్నికలు.. మూడో స్థానంలో సీఎం కేసీఆర్, రెండో స్థానంలో కేటీఆర్

తెలంగాణ ఎన్నికలు.. మూడో స్థానంలో సీఎం కేసీఆర్, రెండో స్థానంలో కేటీఆర్

తెలంగాణ ఎన్నికలు.. మూడో స్థానంలో సీఎం కేసీఆర్, రెండో స్థానంలో కేటీఆర్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. పోస్టల్‌, సర్వీస్‌ ఓట్లను లెక్కింపు పూర్తి కాగా.. ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ కౌంటింగ్ లో గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన పోటీలో ఉన్న మరో స్థానం కామారెడ్డిలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ తర్వాత మూడోస్థానంలో కేసీఆర్ ఉన్నారు.

మిగతా మరికొన్ని స్థానాల్లో..

సిరిసిల్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. కేటీఆర్ వెనుకంజలో ఉన్నారు

చార్మినార్‌లో బీజేపీ అభ్యర్థి 2,539 ఓట్లతో ముందంజలో ఉన్నారు

వరంగల్‌ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ముందంజ

చెన్నూరులో గడ్డం వివేకానంద (కాంగ్రెస్) ఆధిక్యం

జుక్కల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి షిండే ముందంజ

కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఆధిక్యం

భూపాలపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణరావు ముందంజ

నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ముందంజ

మక్తల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీహరి ముందంజ

నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధీక్యం

Updated : 3 Dec 2023 4:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top