Home > తెలంగాణ > KCR : నేటినుంచి 3 రోజులపాటు కేసీఆర్ రాజశ్యామల యాగం..

KCR : నేటినుంచి 3 రోజులపాటు కేసీఆర్ రాజశ్యామల యాగం..

KCR : నేటినుంచి 3 రోజులపాటు కేసీఆర్ రాజశ్యామల యాగం..
X

నేటి నుంచి మూడు రోజులపాటు ఎర్రవల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభతో కలిసి రాజ్యశ్యామల యాగంలో పాల్గొన్నారు. బుధవారం నాడు తెల్లవారుజామున విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి పర్యవేక్షణలో యాగ సంకల్పంతో రాజేష్ శ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు.

ఈ రాజ శ్యామల యాగానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు హాజరుకానున్నారు. రాజ శ్యామల యాగం రెండో రోజు వేద పారాయణాలు జరుగుతాయి. హోమం, తదితర క్రతువులు కూడా రెండో రోజే జరుగుతాయి. యాగం మూడో రోజు అంటే చివరి రోజు పూర్ణాహుతి ఉంటుంది. రాజశ్యామల యాగం చేసిన ప్రతీసారి కేసీఆర్ విజయం సాధించారు.

గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు సీఎం కేసీఆర్. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంలోనూ ఢిల్లీలో యాగం నిర్వహించారు. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని.. ఈసారికూడా రాజ శ్యామల యాగం ద్వారా మూడోసారి అధికారం చేజిక్కించుకుంటారని పార్టీ వర్గాల విశ్వాసం. మూడు రోజులు జరగనున్న ఈ యాగం కోసం మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఎర్రవల్లి చేరుకున్నారు.




Updated : 1 Nov 2023 5:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top