Home > తెలంగాణ > మా వాళ్లను పశువుల్లా కొనుక్కుంటోంది.. కేసీఆర్

మా వాళ్లను పశువుల్లా కొనుక్కుంటోంది.. కేసీఆర్

మా వాళ్లను పశువుల్లా కొనుక్కుంటోంది.. కేసీఆర్
X

తెలంగాణ ప్రజలు బాగా ఆలోచించుకుని ఓటు వేయాలని, ఆకర్షణీయమైన హామీలు చూసి మోసపోవద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఓటు ప్రజల తలరాతను మారుస్తుందని, దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం వెల్లి విరిసే రోజు రావాలని ఆకాంక్షించారు. ఆయన మంగళవారం మంథనిలో ఏర్పాటు చేసిన చేసిన ‘బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌’లో ప్ర‌సంగించారు. 60 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఆగమాగం చేసిందని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన నాయకులను పశువుల్లా కొనుక్కుంటోందని ఆరోపించారు.

‘‘మన గోస పోసుకున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలె. కాంగ్రెస్ పాలనలో మంచినీటికి, సాగునీటికి క‌రెంటుకు అన్నిటికి కొరతే. అమాయక ప్రజలు ఎన్‌కౌంటర్లు అయ్యేవాళ్లు. మన దేశంలో రాజకీయాలు పరిణతి చెందలేదు. ఎన్నికలప్పుడు పార్టీలు ల‌క్ష‌ల‌ కోట్లు పెసి వేరే పార్టీల నాయకులకు సంత‌లో ప‌శువుల్లా కొనుక్కుకుంటున్నారు. పచ్చి అబద్ధాలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలంటే ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరగాలి. నాలుగు పైసలకు ఆశపని ఓటును అమ్ముకోవద్దు. ఓటేసేటప్పుడు ఆగ‌మాగ‌ కావొద్దు. మీ ఊరివాళ్లతో చర్చింది నిర్ణయం తీసుకోండి’’ అని సీఎం కోరారు. బీఆర్ఎస్ లక్ష్యం తెలంగాణ అభివృద్ధేనన్న ఆయన తమ ప్రభుత్వం పదేళ్లలో చేసిన ప్రజల కళ్ల ముందే ఉందని అన్నారు.


Updated : 7 Nov 2023 5:12 PM IST
Tags:    
Next Story
Share it
Top