అందుకే అలా చేశాను..ట్విటర్లో కేసీఆర్ మనవడి ట్వీట్
X
తాతకు తగ్గ మనవుడు. తండ్రికి తగ్గ కొడుకు, అత్తకు తగ్గ అల్లుడు అని పేరు తెచ్చుకుంటున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు రావు. ఓ వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే మరోవైపు తనలోని టాలెంట్‌ను తన ఫాలోవర్స్‌కు పరిచయం చేస్తుంటాడు. పేద పిల్లలకు స్కూలు ఫీజులు చెల్లించడం, అవసరమైతే వారికి పుస్తకాలను కొనివ్వడం ద్వారా ఎంతో మంది పిల్లలకు సాయం అందించాడు. ఈ మధ్యనే ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా సదుపాయాలను కల్పించి సభాష్ అనిపించుకున్నాడు. సోషల్ మీడియాలో హీరో అయ్యారు హిమాన్షు.
Due to some technical issues, the release of "Pretty" has been rescheduled to a later date.
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 23, 2023
I'll share the release date after we resolve these issues.
Thank you!
ఇవన్నీ పక్కన పెడితే హిమాన్షు రీసెంట్గా ఓ అనౌన్స్మెంట్ చేశాడు. తన తండ్రి కేటీఆర్ బర్త్ డే రోజైన జులై 24న ఆయనకు గిఫ్ట్‌గా ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా తన ట్విటర్లో షేర్ చేసి మురిసిపోయారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రెట్టీ పాటను విడుదల చేయలేకపోతున్నానని తాజాగా హిమాన్షు తెలిపాడు. పాట రిటీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తన ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేశాడు. అన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరలోనే పాటను మరో తేదీన విడుదల చేస్తానని ప్రకటించాడు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.