Home > తెలంగాణ > గ్రూప్ తగాదాలపై సీఎం కేసీఆర్ సీరియస్ వార్నింగ్..

గ్రూప్ తగాదాలపై సీఎం కేసీఆర్ సీరియస్ వార్నింగ్..

గ్రూప్ తగాదాలపై సీఎం కేసీఆర్ సీరియస్ వార్నింగ్..
X

తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కామారెడ్డిలో చోటు చేసుకున్న గ్రూప్ తగాదాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల మధ్య వివాదాలపై ఆరాతీశారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఇంట్లో నియోజకవర్గ నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కీలక సమావేశం నిర్వహించారు. గ్రూప్‌ తగాదాలు వీడాలని, కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్‌ సూచించారు. ఎంతటి వారైనా సరే.. పార్టీ గీత దాటితే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఎన్నికల్లో పార్టీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, గంప గోవర్ధన్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

కాగా, సీఎం కేసీఆర్ ఈసారి రెండు చోట్ల పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ బరిలో ఉన్నారు. అయితే కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో విపక్షాల నుంచి కూడా బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. గజ్వేల్‌లో సీఎంపై ఈటల రాజేందర్ పోటీచేస్తుండగా.. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.


Updated : 9 Nov 2023 9:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top