Home > తెలంగాణ > జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
X

అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉందని, ఈ విషయాన్ని గుర్తించకుండా కొన్న మీడియా సంస్థలు అదేపనిగా ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతిని, ప్రజాసంక్షేమాన్ని అడ్డుకునే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోమన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ 115 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సీఎం జర్నలిస్టులతో ముచ్చటిస్తూ ఇళ్ల స్థలాలపై స్పందించారు. అవాస్తవాలు, సంక్షేమాన్ని అడ్డుకునే వార్తలను జర్నలిజం అంటారా అని మండిపడ్డారు.

‘‘తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రమని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి. కానీ కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు మాత్రం వాస్తవాలను గమనించకుండా ఇష్టం వచ్చినట్లు దుష్ర్ర్ర్పచారం చేస్తున్నాయి. ప్రగతిని గుర్తించకుండా వ్యతిరేకంగా వార్తలు రాస్తే అదేం పత్రిక? రైతు రుణాల మాఫీపై ఓ పత్రిక మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసింది. ఒక్క దెబ్బతో 20 వేల కోట్ల రుణాలు రద్దు చేశాం. ఇప్పుడు అది ఎక్కడ ముఖం పెట్టుకుంటుంది? కొన్ని కుల పత్రికలు, కొన్ని గుల పత్రికలు ఉన్నాయి. న్యూస్ పేపర్లు, ఛానళ్లతో సమస్య లేదు. కానీ వ్యూస్ పేపర్లు, ఛానళ్లతో కష్టం. పాలు పోసి పాములను పెంచలేం కదా’’ అన్నారు.

సరికాదు.. జర్నలిస్టుల అధ్యయన వేదిక

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఖండించింది. ‘‘సమాజానికి నాలుగవ స్తంభమైన మీడియా పై అభ్యంతర వ్యాఖ్యలు సమంజసం కాదు. పత్రికలలో పని చేస్తున్న జర్నలిస్టులకు తమ సంస్థల విధానాలతో ముడి పెట్టడం సరైనది కాదు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టడమే’’ అని వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి సాదిక్ ఓ ప్రకటనలో తప్పుబట్టారు.


Updated : 21 Aug 2023 1:48 PM GMT
Tags:    
Next Story
Share it
Top