KCR Warning : తిరగబడితే తీసీ అవతల పడేస్తాం... కేసీఆర్ వార్నింగ్..
X
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది కాబట్టి ఎన్నికల సమయం మొదలైనట్టేనని సీఎం కేసీఆర్ అన్నారు. టికెట్లు ఆశించిన భంగపడినవారు, రెబెల్స్ వంటి వారు ఎవరున్నా వారిని బుజ్జగించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ‘’తిరగబడితే తీసి అవతల పడేస్తాం. ఎవరి కర్మ వారు అనుభవిస్తారు’’ అని ఘాటుగా హెచ్చరించారు. టికెట్లు రానంత మాత్రన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని, దయచేసే రాద్ధాతం చేసి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కోరారు.
‘‘మాది సన్యాసుల పార్టీ కాదు కదా. రాజకీయాల్లో ఓట్లు పడాలనే కోరుకుంటాం. బీఆర్ఎస్ సముద్రం లాంటిది. అందరికీ అవకాశాలు ఉంటాయి. మీరు పార్టీలోనే ఉండాలి. రాజకీయమంటే ఎమ్మెల్యేగా పని చేయడమే కాదు. చాలా చేయొచ్చు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ.. ఇలా అనేక చాన్సులు ఉంటాయి. జెడ్పీ త్ ఛైర్మన్లు కూడా కావొచ్చు. ఇదివరకు అలా అవకాశాలు కల్పించారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ మాకు మాత్రం ఓ టాస్క్’’ అని అన్నారు. జాబితాలో అభ్యర్థులు ప్రజలతో మమేకమయ్యారని, అందుకే వారికి టికెట్లు ఇచ్చామన్నారు.